హెచ్‌సీఏ అండర్–19 కరీంనగర్ జిల్లా జట్టుకు అజయ్ చంద్ర
హెచ్‌సీఏ అండర్–19 కరీంనగర్ జిల్లా జట్టుకు అజయ్ చంద్ర
అండర్–16లో ప్రతిభకు గుర్తింపుగా అండర్–19లో అవకాశం
కమాన్‌పూర్, సెప్టెంబర్ 23 (ఇది మన హక్కు): పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన యువ క్రికెటర్ నల్లగొండ అజయ్ చంద్ర గౌడ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అండర్–19 సీ డివిజన్ లీగ్ కోసం కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల అండర్–16 స్థాయిలో కనబరిచిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుని అండర్–19లో అవకాశం దక్కింది.
కుడిచేతి ఫాస్ట్ బౌలర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా అజయ్ చంద్ర గౌడ్ ప్రతిభ కనబరుస్తున్నాడు. అండర్–16 పోటీల్లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న అతడు ప్రస్తుతం అండర్–19 స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు..
గ్రామీణ ప్రాంతం నుంచి హెచ్‌సీఏ అండర్–19 జిల్లా జట్టుకు ఎంపిక కావడం కమాన్‌పూర్ ప్రాంత క్రీడాభిమానుల్లో ఆనందం నింపింది. అజయ్ చంద్ర గౌడ్ ఎంపిక పట్ల కుటుంబ సభ్యులు, కోచ్‌లు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు. భవిష్యత్ పోటీల్లోనూ రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు..

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి