ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి.. ఏఐ, ఐసీటీ ఆధారిత బోధనపై దృష్టి సారించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఇది మన హక్కు మండల రిపోర్టర్ ✍️
ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి.. ఏఐ, ఐసీటీ ఆధారిత బోధనపై దృష్టి సారించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జూలై 23 (ఇది మన హక్కు): ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నాణ్యమైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుల మూడు రోజుల ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చదవడం, రాయడం, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, కమ్యూనికేషన్ వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేలా బోధన కొనసాగించాలని సూచించారు. అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి రిమీడియల్ తరగతులు నిర్వహించాలని తెలిపారు.
బోధనలో కృత్రిమ మేధస్సు (AI), ఐసీటీ, దీక్ష (DIKSHA) యాప్, శిక్ష కో-పైలట్ వంటి డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. కార్యకలాపాల ఆధారిత బోధన, ప్రయోగాత్మక అభ్యాసం, వర్క్‌బుక్‌లు, ల్యాబ్ మాన్యువళ్ల వినియోగంతో విద్యార్థుల ప్రతిభను మరింత మెరుగుపరచవచ్చన్నారు.
శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులను ఉత్తమ ఫలితాల దిశగా నడిపించాలని కలెక్టర్ సూచించారు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి