ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
అర్టీసీ స్వీపర్ కాంట్రాక్ట్ కార్మికులకు జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలి – ఏఐటీయూసీ
గోదావరిఖని, జూలై 20 (ఇది మన హక్కు):
ఆర్టీసీ బస్టాండ్‌లో పనిచేస్తున్న స్వీపర్ కాంట్రాక్ట్ కార్మికులకు జీఓ ప్రకారం వేతనాలు చెల్లించి, పని భద్రతతో పాటు అన్ని సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని ఏఐటీయూసీ రామగుండం నగర సమితి డిమాండ్ చేసింది..సోమవారం ఆర్టీసీ డీఎం కే. కవితకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రతి నెల మొదటి వారంలో జీతాలు చెల్లించాలని, పీఎఫ్, జీతం స్లిప్పులు, వార్షిక బోనస్‌తో పాటు యూనిఫామ్, షూస్, రెయిన్‌కోట్, టోపీలు వంటి భద్రతా సామగ్రిని అందించాలని కోరారు..కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, సమస్యలు పరిష్కరించకపోతే ఆర్టీసీ డీఎం కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి