గోదావరిఖనిలో ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ శిబిరం.. 38 మందిని రేకుర్తి ఆసుపత్రికి తరలింపు
లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 72 మందికి కంటి పరీక్షలు..
గోదావరిఖని, జూలై 31 (ఇది మన హక్కు): గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్‌నగర్ 52వ డివిజన్ రాజస్థాన్ భవన్లో లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ శిబిరం నిర్వహించారు.
శిబిరంలో మొత్తం 72 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, కంటి ఆపరేషన్ అవసరమైన 38 మందిని ప్రత్యేక బస్సులో కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఈ విడతలో తరలించలేకపోయామని, తదుపరి శిబిరంలో వారికి అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 52వ డివిజన్ కార్పొరేటర్ చిధ్రల నాగరాజు, లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని అధ్యక్షుడు చిట్టిమల కిషోర్, కార్యదర్శి అల్లాడి నాగరాజు, ట్రెజరర్ చింతకింది కృష్ణ, లియో టు లయన్స్ కోఆర్డినేటర్ నార్ల ప్రసాద్, జోన్ చైర్మన్ కొమరవెల్లి సుధాకర్, లక్ష్మీవాణి, లైన్స్ క్లబ్ ఆఫ్ లక్ష్మీనగర్ అధ్యక్షుడు అనఘం కృష్ణమూర్తి, డీసీ విజన్ కోఆర్డినేటర్ చందర్ గుప్తా, డీసీ ఐ క్యాంప్స్ స్క్రీనింగ్ కోఆర్డినేటర్ మామిడిపల్లి శ్రీధర్, లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షుడు కోదాటి ప్రవీణ్, లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని వాసవి అధ్యక్షుడు కొమరవెల్లి రాహుల్‌తో పాటు లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు..


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి