బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలుఅమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం – వ్యాళ్ల హరీష్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం – వ్యాళ్ల హరీష్ రెడ్డి

గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి నాయకులతో కలిసి తెలంగాణ అమరుల స్థూపానికి నివాళులర్పించి, తెలంగాణ తల్లి మరియు అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ కఠోర దీక్ష, అచంచల సంకల్పం ఫలితమని అన్నారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది అమరుల త్యాగాల వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టి ఉద్యమాన్ని విజయవంతం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు చరిత్రను విస్మరించి కేసీఆర్‌పై విమర్శలు చేయడం బాధాకరమని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదాలతో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జహీద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, బూరుగు వంశీకృష్ణ, బొబ్బిలి సతీష్, కృష్ణస్వామి, పర్శ స్వాతి, మేకల రామస్వామి, బోట్ల పోషం, నడిపెల్లి సాయి, కడమండ్ల శ్రీహరి, కళాధర్ రెడ్డి, సురేందర్, రోడ్డ సంపత్, కరాటే రాములు, కడార్ల శ్రీధర్, సార్ల ఉదయ్, కొండ సురేష్, ఎస్కే మోహిన్, జక్కుల ప్రేమ్ కుమార్, యువరాజ్ నేత, కంకణాల దేవేందర్, దువాసి కార్తీక్, వీసం ప్రదీప్, పోయిల రవి, యుగేందర్, శ్రీకర్, ఎలకపల్లి అంజయ్య, ఎండి అన్ను, బండి రాజు, ఎస్కే షరీఫ్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...