కాంట్రాక్టర్ జియో బాయ్, షేక్ ఆలీ పాషా, మజుద్ ఖాన్ ను గణంగ సన్మానించిన- జామ మజీద్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు
ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
కాంట్రాక్టర్ జియో బాయ్, షేక్ ఆలీ పాషా, మజుద్ ఖాన్ ను గణంగ సన్మానించిన- జామ మజీద్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టి టి ఎస్ అంతర్గాం గ్రామ జామా మజీద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ జియో బాయ్ షేక్ అలీ పాషా, మజుద్ ఖాన్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జామా మజీద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అల్తాఫ్ మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా జామ మజీద్, పేద మధ్య తరగతి కుటుంబాల కోసం ఆలోచించి ఎండి జాకీర్ హైమద్ బి గ్రూప్ ద్వారా వీరు ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అనంతరం ఎండి జాకీర్ మాట్లాడుతూ మా అంతర్గాం ముస్లిం మైనార్టీ కుటుంబాలకు కాంట్రాక్టర్ జియో బాయ్, షేక్ ఆలి పాషా, మజుద్ ఖాన్ కుల, మత, పేద మధ్యతరగతి విభేద లేకుండా ఎన్నో కుటుంబాలకు ఆపదలో ముందుంటూ అనేక సహాయ,సహకారాలు అందిస్తూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆపదలో నేనున్నానంటూ ముందుకు వచ్చి ఎంతోమందికి ఆపద బాంధవుడు లాగా వెన్నంటే ఉంటూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జియో బాయ్, షేక్ అలీ పాషా కు ఎప్పుడు రుణపడి ఉంటామని వారి సేవలను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు