12, జూన్ 2026, శుక్రవారం

జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే SIR కార్యక్రమంపై ప్రత్యేక శిక్షణ

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే SIR కార్యక్రమంపై ప్రత్యేక శిక్షణ

గౌరవ ERO రామగుండం & AC(LB) మేడం జె. అరుణ శ్రీ ఐఏఎస్ గారి సమక్షంలో శుక్రవారం కాకతీయ కళ్యాణ మండపం, PTSలో జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న SIR కార్యక్రమానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని AEROలు, BLO సూపర్వైజర్లు, BLOలు మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

SIR కార్యక్రమం నిర్వహణ, విధివిధానాలు, బాధ్యతలు మరియు ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన అంశాలపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ERO & AC(LB) జె. అరుణ శ్రీ ఐఏఎస్, పాలకుర్తి తహసీల్దార్ జె. సునీత, రామగుండం తహసీల్దార్ రవీందర్ రావు, మాస్టర్ ట్రైనర్ నాయబ్ తహసీల్దార్ అనీల్ తదితరులు పాల్గొన్నారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి