అమృత లింగేశ్వర సహిత శక్తి అమ్మవార్ల దేవాలయం షెడ్డు నిర్మాణానికి అమెరికా ప్రవాసి చక్రధర్ రూ.10 లక్షల విరాళం
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
అమృత లింగేశ్వర సహిత శక్తి అమ్మవార్ల దేవాలయం షెడ్డు నిర్మాణానికి అమెరికా ప్రవాసి చక్రధర్ రూ.10 లక్షల విరాళం
షెడ్డు నిర్మాణానికి దేవాలయనికి ఎన్నో సహకారాలు అందించిన పోతరాజుల రాధా కిషన్- అంబికా దేవి, చక్రధర్ కుటుంబ సభ్యులు
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామానికి చెందిన అమెరికా ప్రవాసి పోతరాజుల రాధాకిషన్ – అంబికాదేవి దంపతుల కుమారుడు పోతరాజుల చక్రధర్ అమెరికా ప్రవాసి గ్రామంలోని ఆలయ అభివృద్ధికి ఉదారంగా ముందుకు వచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణం కోసం సుమారు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. దీనికి భూమి పూజ కార్యక్రమం వేద బ్రాహ్మణులు కమ్మల వామన్, నటరాజు శర్మ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దాత అమెరికా ప్రవాసి చక్రధర్ కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఘనంగా అభినందించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ స్వగ్రామం పట్ల ఉన్న అభిమానం, ఆధ్యాత్మిక సేవాభావంతో ఆలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.
గ్రామానికి చెందిన యువకుడు అమెరికా ప్రవాసి చక్రధర్ అందించిన ఈ విరాళంతో ఆలయానికి అవసరమైన షెడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆలయ నిర్వాహకులు, పూజారి కమ్మల వామన్, నటరాజ్ శర్మ తెలిపారు. ఆయన సేవా స్పూర్తి ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, పూజారి కమ్మల వామన్, నటరాజ్ శర్మ కొనియాడారు.
కామెంట్‌లు