15, మే 2026, శుక్రవారం

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలి: పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి

 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలి: పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ డీసీపీ బి. రామ్‌రెడ్డి వార్షిక తనిఖీల్లో భాగంగా అంతర్గాం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీసీపీకి గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, రామగుండం సీఐ కృష్ణకుమార్, అంతర్గాం ఎస్‌ఐ వెంకట స్వామి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిశుభ్రత,పరిసరాల నిర్వహణ,రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.అలాగే పోలీస్ సిబ్బందితో పరేడ్ నిర్వహించి వారి పనితీరు,విధుల నిర్వహణపై సమీక్ష చేపట్టారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలు, నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కార స్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని తగిన సూచనలు చేశారు.ఈ సందర్భంగా డీసీపీ బి. రామ్‌రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, బాధితుల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు.ప్రజల్లో పోలీస్ శాఖపై భరోసా, విశ్వాసం,నమ్మకం పెంపొందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రతి పోలీస్ అధికారి ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి