6, మే 2026, బుధవారం

అకాల వర్షాల ప్రభావం… లోతట్టు ప్రాంతాల పరిశీలన – తక్షణ చర్యలకు ఆదేశాలు: ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

అకాల వర్షాల ప్రభావం… లోతట్టు ప్రాంతాల పరిశీలన – తక్షణ చర్యలకు ఆదేశాలు   ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

రెండో డివిజన్ జంగాలపల్లి ప్రాంతంలో అకాల వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడిన సమస్యలను రామగుండం ఎమ్మెల్యే శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ గారు పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు నగర మేయర్ మహంకాళి స్వామి, మక్కాన్సింగ్ పాల్గొన్నారు.
ప్రాంత పరిస్థితులను ముందస్తుగా అంచనా వేసిన ఎమ్మెల్యే, నీటిముంపు సమస్యలు తీవ్రంగా మారకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు.
ఈ సందర్భంగా అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రెండో డివిజన్ కార్పొరేటర్ వెంగళ బాపు, మేరుగు అభిషేక్, అందుగురి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి