ఓదెల హై స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి సంబరాలు: పిల్లలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సతీష్..
ఓదెల హై స్కూల్ లో ముందస్తుగా పిల్లలతో సంక్రాంతి వేడుకలు జరుపుకున్న సర్పంచ్ సతీష్ ఓదెల మండల కేంద్రంలో గల ఓదెల హై స్కూల్ లో స్కూల్ పిల్లలకు ముగ్గుల పోటీ నిర్వహించి పిల్లలు హరిదాసు వేషాలు వేసి సందడి చేశారు.ముఖ్య అతిథిగా సర్పంచ్ సతీష్ విచ్చేసి పిల్లలతో సరదాగా గడిపారు.పిల్లలు వేసిన ముగ్గుల పోటీలను ఉపసర్పంచ్ శ్రీలత గోపతి , మరియు హెడ్మాస్టర్ పద్మావతి, పరిశీలించి మొదటి బహుమతి గా G. శృతి ద్వితీయ బహువమతి P. అక్షయ తృతీయ బహుమతి G. సంజన గా ప్రకటించగా సర్పంచ్ చేతులమీదుగా బహుమతులు అందజేయడం జరిగింది.అనంతరం భోగి పండుగ చేసుకొని పాయసం పంపిణీ చేశారు అధ్యాపక బృందం. సర్పంచ్, విద్యార్థుల యొక్క చదువు స్కూల్ లో విద్యార్థుల హాజరుషాతం గురించి తెలుసుకొని స్కూల్ హెడ్మాస్టర్ తో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీష్ ఉప సర్పంచ్ శ్రీలత ప్రవీణ్ వార్డ్ సభ్యులు రాచర్ల అశోక్ దూలం సదానందం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు...
కామెంట్‌లు