ఆర్.ఎఫ్.సి.ఎల్ టౌన్షిప్‌లో శ్రీ చైతన్య హై స్కూల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ – ముఖ్య అతిథిగా సీపీ అంబర్ కిషోర్ ..
@గోదావరిఖని ఆర్.ఎఫ్.సి.ఎల్::://
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీ చైతన్య హై స్కూల్స్ ఆర్.ఎఫ్.సి.ఎల్ మరియు ఎన్.టి.పి.సి పాఠశాలల విద్యార్థులకు డాక్టర్ బి.ఎస్.రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రెండు పాఠశాలల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన విద్యార్థులను హైదరాబాదులో జరిగే అటువంటి నెక్స్ట్ లెవెల్ గేమ్స్ కి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ. అంబర్ కిషోర్ జ, ఐ.పీ.ఎస్.. హాజరై ప్రారంభించడం జరిగింది. ముఖ్యఅతిథి మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం వారు ఇటువంటి ఆటల పోటీల కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో చదువుతోపాటు మానసిక ఉల్లాసం మరియు ఉత్సాహం కలుగుతుందని విద్యార్థులు ఆటల పోటీలో గెలుపొందాలని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం కి రెండు పాఠశాలల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్, రవి మరియు హైదరాబాదు నుండి పి.ఈ.టి లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు...
కామెంట్‌లు