ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

దీపావళి వేళ రామగుండం అభివృద్ధికి వెలుగులు.. మసీద్ టర్నింగ్ సెంటర్ లైటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

  రూ.35 కోట్లతో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, యూజీడీ పనులు.. పేదల సంక్షేమమే లక్ష్యమని ఎమ్మెల్యే వెల్లడి రామగుండం (ఇది మన హక్కు), నవంబర్ 07, 2026: దీపావళి పండుగ వేళ రామగుండం పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని మసీద్ టర్నింగ్ వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ ప్రారంభించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రూ.35 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు రామగుండం పట్టణంలో సుమారు రూ.35 కోట్లతో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. బి పవర్‌హౌస్ గడ్డ (హనుమాన్ జంక్షన్) నుంచి లింగాపూర్ మీదుగా స్టేషన్ ఫ్లైఓవర్ వరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కనీస రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి డివిజన్‌లో మ...

రివర్ ఏకోసిస్టంపై మైక్రోప్లాస్టిక్స్ ముప్పు

 ప్లాస్టిక్,రసాయన కాలుష్యం వల్ల నదులు వాటిపై ఆధారపడి జీవించే సమస్త జీవరాశి తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. నదీ పర్యావరణ వ్యవస్థ (River Ecosystem) దెబ్బతినడం వల్ల జలచరాలు, పక్షులు, జంతువులు అంతిమంగా మానవాళిపై పడుతున్న ప్రధానదుష్ప్రభావాలు: గోదావరిఖని నవంబర్ 7 (ఇది మన హక్కు): 1. జలచరాల మరణాలు (Threat to Aquatic Life) • ఆహారంగా భ్రమించడం: నదులలో తేలియాడే ప్లాస్టిక్ కవర్లు, చిన్న ముక్కలను చేపలు, తాబేళ్లు తమ ఆహారంగా (జెల్లీఫిష్ లేదా చిన్న పురుగులుగా) భావించి మింగుతాయి. • జీర్ణవ్యవస్థ స్తంభించడం: ప్లాస్టిక్ జీర్ణం కాకపోవడం వల్ల వాటి పొట్ట నిండిపోయి, ఆకలి వేయక, పోషకాహార లోపంతో శ్వాస ఆడక ఏటా లక్షలాది జలచరాలు చనిపోతున్నాయి. • ఉచ్చులో చిక్కుకోవడం: నదుల్లో పారేసే పాత నైలాన్ చేపల వలలు (Ghost Nets), ప్లాస్టిక్ రింగులలో చేపలు, తాబేళ్లు, ముసళ్ళు ఇరుక్కుపోయి ఈదలేక, గాయాల పాలై ప్రాణాలు కోల్పోతున్నాయి. 2. నదీ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం (Disruption of Ecosystem) • సూర్యరశ్మి, ఆక్సిజన్ అందకపోవడం: నది ఉపరితలంపై ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోవడం వల్ల నీటిలోకి సూర్యరశ్మి ప్రసరించదు. దీనివ...

కృష్ణవేణి వికాస్ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక పరీక్ష – 149 మంది విద్యార్థుల భాగస్వామ్యం

  కృష్ణవేణి వికాస్ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక పరీక్ష – 149 మంది విద్యార్థుల భాగస్వామ్యం గోదావరిఖని నవంబర్ 6 (ఇది మన హక్కు): యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడి, వారిలో చైతన్యం కల్పించాలనే లక్ష్యంతో జమాత్-ఎ-ఇస్లామీ హింద్, గోదావరిఖని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ప్రచారంలో భాగంగా కృష్ణవేణి వికాస్ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మొత్తం 149 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనాబ్ మసూద్ అహ్మద్ ఖాన్, ఫాజిల్ అహ్మద్ ఖాన్, బ్రదర్ ఉజైర్, బ్రదర్ ఫౌజాన్ పాల్గొన్నారు. కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పరీక్ష ప్రశాంతంగా నిర్వహించబడింది. యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. నినాదం: మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి!

5 ఇంక్లైన్ కాలనీలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ !

5 ఇంక్లైన్ కాలనీలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ  గోదావరిఖని నవంబర్ 5 (ఇది మన హక్కు): యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి – ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి జమాత్-ఎ-ఇస్లామీ హింద్ (JIH) గోదావరిఖని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచారంలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు 5 ఇంక్లైన్ కాలనీలో మహిళా విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయిషా సిద్దిఖా మోడరేటర్‌గా వ్యవహరించారు. సుమారు 40 మంది మహిళా విభాగం కార్యకర్తలు పాల్గొని కాలనీలో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సబీరా నాజ్, ఆయిషా సిద్దిఖా, జాహెదా, నూర్ జహాన్, నాజియా బేగం, రజియా బేగం, షానాజ్, అంజుమ్ బాను పాల్గొన్నారు. అలాగే నిసార్, సమ్మక్క, పద్మ, రాజేశ్వరి తదితరులు ర్యాలీలో చురుకుగా పాల్గొన్నారు. మత్తు పదార్థాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడంలో తల్లిదండ్రులు, మహిళలు, విద్యావంతులు, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణమే మనందరి ల...

రామగుండం ఆర్టీసీ బస్సులో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం

  రామగుండం నవంబర్ 5(ఇది మన హక్కు):డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలి – ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ రామగుండం మండల పరిధిలో జమాతే ఇస్లామీ హింద్ (JIH) గోదావరిఖని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో భాగంగా TGSRTC ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా JIH ఉపాధ్యక్షులు, TEMRIES కౌన్సిలర్, రామగుండం కార్పొరేషన్ మరియు మండల ఇన్‌చార్జి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఉద్దేశించి ప్రసంగించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత జీవితాలు, కుటుంబాలు, సమాజం తీవ్రంగా నష్టపోతున్నాయని వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రజలు మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త శ్రీ నరేష్, సబితం తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి – యువత భవిష్యత్తును కాపాడండి. జమాతే ఇస్లామీ హింద్ – గోదావరిఖని

గోదావరిఖని TGS RTC బస్ డిపో పరిధిలో నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమం

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి యువత భవిష్యత్తును కాపాడేందుకు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం గోదావరిఖని, నవంబర్ 4 (ఇది మన హక్కు): యువత భవిష్యత్తును అంధకారం చేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని జమాతె ఇస్లామీ హింద్ నాయకులు పిలుపునిచ్చారు. గోదావరిఖని TGS RTC బస్ డిపో పరిధిలో నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలకు, యువతకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దీపిక ఫౌండేషన్ కన్వీనర్, జూలపల్లి–రామగుండం మండల ఇన్‌చార్జి భాగ్యలక్ష్మి, నుస్రత్ ఖానం, సబీరా నాజ్ – అధ్యక్షురాలు, ఆయిషా సిద్ధిఖా – మోడరేటర్, ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ – ఉపాధ్యక్షులు, జమాతె ఇస్లామీ హింద్; రామగుండం కార్పొరేషన్ మరియు మండల ఇన్‌చార్జి తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు కోరారు. ...

రామగుండంలో 24/7 తాగునీటి సరఫరాకు చర్యలు: మేయర్ మహంకాళి స్వామి

  రూ.100 కోట్లతో ఎనిమిది ఉపరితల జలాశయాలు, కొత్త పైప్‌లైన్ల నిర్మాణం.. నర్సింగ్ కళాశాల ఆవరణలో రూ.2 కోట్లతో జలాశయానికి భూమిపూజ రామగుండం (ఇది మన హక్కు): రామగుండం నగరంలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచి ప్రజలకు 24/7 తాగునీటి సరఫరా అందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సుమారు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. రామగుండం నగరపాలక సంస్థ 11వ డివిజన్ పరిధిలోని నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాల ఆవరణలో ఉపరితల జలాశయ నిర్మాణ పనులకు మంగళవారం స్థానిక కార్పొరేటర్ కారెంగుల రమ్య ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ఎనిమిది ఉపరితల జలాశయాలు, కొత్త పైప్‌లైన్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నర్సింగ్ కళాశాల ఆవరణలో సుమారు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఉపరితల జలాశయం ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యంతో ఉంటుందని, సుమారు పది వేల మంది జనాభా అవసరాలను తీర్చగలదని చెప్పారు. నిర్మాణ పనులను ఏడాది లోగా పూర్తి చేయాలని లక...

ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వాటిని పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.  పెద్దపల్లి, నవంబర్ 02 (ఇది మన హక్కు): సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జోగుల లచ్చయ్య సర్వే నంబర్ 429లో ఉన్న ఏడు గుంటల భూమికి పట్టాదారు హక్కులు కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దీనిపై ధర్మారం తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన జాసోదపు లక్ష్మి తమది నిరుపేద కుటుంబమని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరగా, ఈ దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోవాలని పీడీ హౌసింగ్‌కు సూచించారు. మంథని మండలం నాగారం గ్రామా...

బాల భీముడు

 సహజ ప్రసవంలో 4.40 కిలోల మగ శిశువు చౌటుప్పల్‌, నవంబర్ 2(ఇది మన హక్కు): చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు శుక్రవారం అరుదైన సహజ ప్రసవంలో 4.40 కిలోల మగ శిశువుకు పురుడు పోసినట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా.సూర్యశ్రీరావు తెలిపారు. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన పల్రెడ్డి హేమ(25) గురువారం అర్ధరాత్రి 12.30కు పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చారని చెప్పారు. ఆమెకు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యాధికారి డా.అవినాశ్, పీడియాట్రీషియన్లు డా.కావేరి, డా.అజీమా, నర్సింగ్ ఆఫీసర్లు శారద, ధనమ్మ, నాగవరదాయినులు రాత్రి 1.42 గంటలకు సహజ ప్రసవం చేశారని వెల్లడించారు. చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతినేలా ఆమె ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారని, ఆసుపత్రిలో గైనకాలజిస్టు, యోగా మాస్టర్, యునాని వైద్యురాలు, ఫిజియోథెరపిస్టుల సూచనలు పాటించి యోగా సనాలు, వ్యాయమాలు చేసినందుకు గర్భంలో 4.40 కిలోల శిశువున్నా సహజ ప్రసవం అయిందని వివరించారు. ఈ కాలంలో అంత పెద్ద శిశువుకు సహజ ప్రసవం అయ్యేందుకు ఆమె శరీరం, ప్రకృతి కూడా సహకరించిందని తెలిపారు. ఆమెకిది రెండో కాన్పుని, తొలి కాన్పులోనూ 4 కిలోల బరువున్న శిశువుకు సహజ ప్రస...

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలి – యువత భవిష్యత్తును కాపాడాలి

  మార్కెట్‌లో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో అవగాహన ప్రచారం గోదావరిఖని: 8 ఇంక్లైన్ కాలనీ(ఇది మన హక్కు):మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి పెనుముప్పుగా మారుతోందని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జమాత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని శాఖ నాయకులు పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా సోమవారం 8 ఇంక్లైన్ కాలనీలోని సోమవారం మార్కెట్ ప్రాంతంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని అధ్యక్షులు సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేనీ, ఉపాధ్యక్షులు ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పాల్గొని ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజ భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. యువతను ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జమాత్ సభ్యులు రిజ్వాన్, ఖజ...

యువత భవిష్యత్తును కాపాడేందుకు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

  యువత భవిష్యత్తును కాపాడేందుకు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం జమాఅతె ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ నాయకుల పిలుపు గోదావరిఖని, నవంబర్ 1 (ఇది మన హక్కు): యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జమాఅతె ఇస్లామీ హింద్ (JIH) గోదావరిఖని యూనిట్ అధ్యక్షులు సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేని, ఉపాధ్యక్షులు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పిలుపునిచ్చారు. జమాఅతె ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 11 వరకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు గోదావరిఖని ప్రెస్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం న్యాయవాదులు, వైద్యులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, మేధావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మత్తు పదార్థాల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డ్రగ్స్ అక్రమ విక్రయాలు, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం, సంబంధిత ప్రభుత్వ శ...

ఆహారంతో పాటు పొట్టలోకి వెళ్తున్న ఆ నల్లటి విషం ఏంటో తెలుసా?

  ఒకప్పుడు హోటల్‌లో టిఫిన్ చేసినా, భోజనం చేసినా అరటాకుల్లోనో, విస్తరాకుల్లోనో పెట్టి ఇచ్చేవారు. పార్సిల్ తీసుకున్నా వాటిలోనే కట్టేవారు. కానీ కాలక్రమేణా అరటాకుల స్థానంలోకి న్యూస్ పేపర్లు, పాంప్లేట్లు వచ్చిచేరాయి. చాలాకాలంగా టిఫిన్లను ప్లాస్టిక్ కవర్లలోనో, లేదంటే ప్రింట్ చేసిన పేపర్లలోనో చుట్టివ్వడాన్ని చూస్తున్నాం. గోదావరిఖని, అక్టోబర్ 30 (ఇది మన హక్కు):స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారు, హోటల్స్, ఇతర ఆహారం అమ్మే వ్యాపారులకు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. బోండాలు, బజ్జీలు, సమోసాలు వంటి ఆహార పదార్థాలను వార్తాపత్రికలు, ఇతర ప్రింటెడ్ పేపర్లలో చుట్టి ఇవ్వడం లేదా వాటిపైన వడ్డించడం ఆరోగ్యానికి హానికరమని తెలిపింది. పేపర్‌పై ప్రింటింగ్‌కు వాడే ఇంక్‌లో రసాయనాలతోపాటు సీసం వంటివి కూడా ఉంటాయని వేడి తగలగానే ఆహారానికి అతుక్కుని ఇవి కూడా కడుపులోకి వెళ్లి అనారోగ్యానికి కారణమవుతాయని తెలిపింది. దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు వైద్య నిపుణులతో మాట్లాడింది ఇది మన హక్కు. ఇటీవల ఒక వీధి వ్యాపారి ఆహారాన్ని న్యూస్ పేపర్లలో చుట్టి ఇవ్వడాన్ని గుర్తించింది ఎఫ్ఎస్ఎస్ఏ...

మతసామరస్యం, విద్వేషరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

  ‘బియాండ్ ది డివైడ్’ ప్రదర్శన, సదస్సును విజయవంతం చేయాలని ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పిలుపు గోదావరిఖని హైదరాబాద్ (ఇది మన హక్కు):మతాల మధ్య అపోహలు, విద్వేషాలు, వివక్షను తొలగించి పరస్పర గౌరవం, విశ్వాసం, సామరస్యంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జమాఅతే ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ ఉపాధ్యక్షులు, టెంరీస్ కౌన్సిలర్, హెచ్‌ఎంఎస్ జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించనున్న ‘బియాండ్ ది డివైడ్ – విద్వేషానికి వ్యతిరేకంగా.. సామరస్యం దిశగా’ ప్రదర్శన, సదస్సులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాజంలో మత, సామాజిక వైవిధ్యాన్ని గౌరవించడం, పరస్పర సంభాషణ ద్వారా అపోహలను తొలగించడం, భిన్న వర్గాల ప్రజల మధ్య స్నేహభావం, నమ్మకాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. చరిత్రను తెలుసుకుంటూ, వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఉమ్మడి భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమ వివరాలు: తేదీలు: అక్టోబర్ 30 నుంచి నవం...

నైనీ బొగ్గు రవాణా మార్గాల నిర్మాణానికి సహకరించండి: అంగూల్ కలెక్టర్‌ను కోరిన సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి

 40 నిర్వాసిత కుటుంబాల పునరావాసానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి.. సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల కాలనీ ఏర్పాటుకూ భూమి కోరిన సీఎండీ సింగరేణి భవన్, అక్టోబర్ 28 (ఇది మన హక్కు): ఒడిశాలోని నైనీ బొగ్గు గని అభివృద్ధి, బొగ్గు రవాణా మార్గాల నిర్మాణం, నిర్వాసితుల పునరావాసం, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపులో సహకరించాలని సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అంగూల్ జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దాల్ అక్తార్‌ను కోరారు. సింగరేణి ప్రతిపాదనలకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం అంగూల్ జిల్లా కలెక్టర్‌తో సీఎండీ ప్రత్యేకంగా సమావేశమై వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ, అనుమతులు, పునరావాస చర్యలపై చర్చించారు. 40 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం నైనీ బొగ్గు గని కారణంగా నిర్వాసితులైన 40 కుటుంబాల కోసం పునరావాసం, పునరుద్ధరణ (ఆర్‌ అండ్‌ ఆర్‌) కాలనీ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించాలని సీఎండీ కోరారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు, కాలనీ నిర్మాణానికి భూసేకరణ, పునరావాస పరిహారానికి సంబంధించిన అంశాలపై నిర్ణయాలు త...

టీజీఎంఆర్‌జేసీ రామగుండం బాయ్స్–1లో తల్లిదండ్రుల సమావేశం

  విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన గోదావరిఖని, అక్టోబర్ 27 (ఇది మన హక్కు): శాంతినగర్‌లోని టీజీఎంఆర్‌జేసీ (TGMRJC) రామగుండం బాయ్స్–1 కళాశాలలో మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రిన్సిపాల్ ముఫ్తీ ముహమ్మద్ ఇర్షాదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రగతి, ప్రవర్తన, క్రమశిక్షణ, మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఎంఆర్‌ఈఐఎస్ కౌన్సిలర్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, గౌరవ అతిథిగా కౌన్సిలర్ శ్రీమతి ఆయిషా సిద్ధిఖీ హాజరయ్యారు. వారు విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, పిల్లల భావోద్వేగ ఆరోగ్యం, తల్లిదండ్రులు–పిల్లల మధ్య సత్సంబంధాలు, సమర్థవంతమైన సంభాషణ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఎదుర్కొనే విద్యాపరమైన, వ్యక్తిగత సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. పరీక్షల మార్కుల మెమోల పంపిణీ యూనిట్ టెస్ట్–1, యూనిట్ టెస్ట్–2, ఐటీపీ–1 పరీక్షల మార్కుల మెమోలను తల్లిదండ్రులకు అందజేశారు. విద్యార్థుల విద్యా ప్రగతిపై...

విజిలెన్స్ అవగాహన కార్యక్రమాలు అన్ని యూనియన్లకూ సమానంగా నిర్వహించాలి

 సింగరేణిలో కొన్ని యూనియన్లకే ప్రాధాన్యత ఇవ్వడంపై HMS అభ్యంతరం బి. వెంకన్న, IRTS, ముఖ్య నిఘా అధికారి గారికి HMS విజ్ఞప్తి గోదావరిఖని, అక్టోబర్ 26,(ఇది మన హక్కు): సింగరేణి సంస్థలోని అన్ని ఏరియాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమాల్లో అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాధాన్యత కల్పించాలని హింద్ మజ్దూర్ సభ (HMS) కేంద్ర కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ విజ్ఞప్తి చేశారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు కేవలం AITUC యూనియన్‌కే పరిమితమా? లేక సింగరేణిలో గుర్తింపు పొందిన అన్ని కార్మిక సంఘాలకు వర్తిస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. కొన్ని డిపార్ట్‌మెంట్లలో AITUC నాయకులను మాత్రమే ఆహ్వానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. విజిలెన్స్ వంటి కీలక కార్యక్రమాల్లో అన్ని యూనియన్ల నాయకులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. విజిలెన్స్ కార్యక్రమాల ఉద్దేశం నెరవేరాలి అవినీతి నిరోధక అవగాహన కార్యక్రమాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని HMS నాయకులు పేర్కొన్నారు. కార్మిక సంఘాల మధ్య వివక్షకు తావులేకుండా, అవినీతి నిరోధక చర్యలపై అన్ని సంఘాల నాయకులు, కార్మికులకు అవగాహన కల్పించా...

రామగుండం అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

 రూ.1.90 కోట్లతో ఇంద్రానగర్‌లో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమిపూజ.. 6 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం, 1,200 గృహాలకు తాగునీటి లక్ష్యం గోదావరిఖని (ఇది మన హక్కు): రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి కాలనీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి సోమవారం 8వ కాలనీ, 19వ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్‌లో రూ.1.90 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్‌కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భూమిపూజ చేశారు. 6 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ట్యాంక్ ద్వారా సుమారు 1,200 గృహాలకు తాగునీటి సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాల విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్య...

తెలంగాణలో లెదర్ పరిశ్రమల పునఃప్రారంభానికి తొలి అడుగు: మొలుగు రాజు

 కరీంనగర్, స్టేషన్ ఘన్‌పూర్‌లో మెగా లెదర్ పార్కుల ప్రతిపాదన.. రామగుండంలోనూ లెదర్ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి హైదరాబాద్ (ఇది మన హక్కు): తెలంగాణలో లెదర్ పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు ప్రారంభం కావడంపై తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ ప్రమోషన్ కోఆపరేటివ్ సొసైటీ జనరల్ సెక్రటరీ మొలుగు రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ దిశగా చొరవ చూపిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ స్టేట్ లెదర్ ఆర్టిజన్స్ ప్రమోషన్ కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆరెపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ డైరెక్టర్, సంబంధిత సంస్థల అధికారులు, HANSA, PERFECT సంస్థల ప్రతినిధులతో పాటు ఐదు లెదర్ ట్యానరీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మూడు గంటలకు పైగా జరిగిన చర్చల్లో లెదర్ పరిశ్రమల పునరుద్ధరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సంప్రదాయ వృత్తిదారులకు ఉపాధి కల్పన వంటి అంశాలపై చర్చించారు. ఆధునిక సాంకేతికతతో సంప్రదాయ వృత్తికి ప్రోత్సాహం దాదాపు రెండు...

ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియను రద్దు చేయాలి

  ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి గోదావరిఖని అక్టోబర్ 25 (ఇది మన హక్కు):ధర్నా చౌక్‌ నిరసన కార్యక్రమానికి గోదావరిఖని నుంచి జేఐహెచ్‌, ఎంపీజే, ఎస్‌ఐఓ, ఐవైఎం ఆధ్వర్యంలో బస్సు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌లో నిర్వహించే నిరసన కార్యక్రమానికి గోదావరిఖని నుంచి బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్‌ (JIH), మూవ్‌మెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ (MPJ), స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (SIO), ఐడియల్‌ యూత్‌ మూవ్‌మెంట్‌ (IYM) ప్రతినిధులు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల కాపాడటం, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడం లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇటీవల హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో మానవ హక్కుల, దళిత, రైతు, విద్యార్థి, యువ...