ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కార్మిక చట్టాలపై అవగాహన పెంచుకుందాం.. ఐక్యంగా ముందుకు సాగుదాం

కార్మిక చట్టాలపై అవగాహన పెంచుకుందాం.. ఐక్యంగా ముందుకు సాగుదాం

కొత్త కార్మిక చట్టాలపై నిర్వహించిన టీబీజీకేఎస్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న నాయకులు


కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు: పుట్ట మధుకర్, మిర్యాల రాజిరెడ్డి..

రామగిరి, సెప్టెంబర్ 25 (ఇది మన హక్కు): కార్మిక చట్టాలు, కార్మికుల హక్కులు, సంక్షేమ కార్యక్రమాలపై మరింత అవగాహన పెంచుకుని ఐక్యంగా ముందుకు సాగాలని మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు.
సెంటినరీ కాలనీలోని సాయిరాం గార్డెన్‌లో అర్జీ-3 ఏపీ డివిజన్ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు నాగేల్లి సాంబయ్య ఆధ్వర్యంలో సెంట్రల్, డివిజన్ కమిటీల ముఖ్య నాయకులకు కొత్త కార్మిక చట్టాలు, సింగరేణి కార్మికుల సమస్యలు, హక్కులు, సంక్షేమ అంశాలపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పింగిలి సంపత్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. సింగరేణి మాజీ పర్సనల్ అధికారి ముప్పిడి రవీందర్ రెడ్డి కార్మిక చట్టాలు, సంక్షేమ కార్యక్రమాలపై నాయకులకు శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా పుట్ట మధుకర్, మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు అన్యాయం జరిగితే తమ సంఘం తరఫున ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. సింగరేణి సంస్థకు రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.52 వేల కోట్లకు పైగా ఉన్నాయని వారు పేర్కొంటూ, సంస్థ ప్రయోజనాల కోసం కార్మికుల తరఫున పోరాటం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలు, సంక్షేమం, వైద్య సౌకర్యాలు, కార్మిక వాడల్లో మౌలిక వసతుల అంశాలపై వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కార్మికులకు అందించిన పలు సౌకర్యాలను కూడా వారు ప్రస్తావించారు. సీనియర్ కార్మికుల మెడికల్ అన్ఫిట్, వారి పిల్లలకు ఉద్యోగాలు, విద్యుత్ చార్జీల రికవరీ రద్దు, ఏసీ సౌకర్యం, సింగరేణి గనుల విస్తరణ తదితర అంశాలను వివరించారు.
గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో కార్మిక సమస్యలపై మరింత ఐక్యంగా, చైతన్యంగా పనిచేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంఘాన్ని బలోపేతం చేసేందుకు కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రామగిరి మండల శాఖ అధ్యక్షుడు శంకేష్ రవీందర్, కమాన్‌పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, రామగిరి మాజీ జెడ్పీ సభ్యులు శారద కుమార్, పట్టణ అధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్‌తో పాటు సెంట్రల్, డివిజన్ కమిటీ నాయకులు, పిట్ సెక్రటరీలు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌లు