న్యూ మారేడుపాక 20వ డివిజన్‌లో ఘనంగా ముగ్గుల పోటీలు...
పెద్దపల్లి జిల్లా న్యూ మారేడుపాక ...
న్యూ మారేడుపాక 20వ,డివిజన్‌లో ఘనంగా ముగ్గుల పోటీలు...
20వ,డివిజన్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.
డివిజన్ అధ్యక్షులు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి మహిళా అధ్యక్షురాలు రజిత ఆధ్వర్యంలో డివిజన్ మహిళ సోదరీమణులు నూతనంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిర్మించిన సిసి రోడ్లపై ముగ్గులు వేసి సంబరాలు వ్యక్తం చేశారు ..ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్ పాల్గొని పోటీలో విజేతలకు బహుమతులు అందించి మన సాంప్రదాయాలను కాపాడుతూ రంగ రంగ వైభవంగా ముగ్గుల పోటీలలో పాల్గొని చక్కగా ముగ్గులు వేసిన మహిళా సోదరీమణులందరికీ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యుల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి, ముందుగా ఆడబిడ్డలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ..కార్యక్రమంలో నరేష్ మహిళలు పాల్గొన్నారు..
కామెంట్‌లు