వన్ టౌన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ఆఫజాలోద్దీన్ ఆధ్వర్యంలో గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఆకస్మిక తనిఖీలు
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
వన్ టౌన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ఆఫజాలోద్దీన్ ఆధ్వర్యంలో గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఆకస్మిక తనిఖీలు
గోదావరిఖని పట్టణంలోని గాంధీ చౌరస్తా ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వన్‌టౌన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ఆఫజాలోద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానాలు విధించారు.
ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని, నేరాల నియంత్రణకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీటుబెల్ట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ఆఫజాలోద్దీన్తో పాటు వన్‌టౌన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు