కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిశ్చయ్ శిబిరం

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిశ్చయ్ శిబిరం

రామగుండం, మే 13: 21వ డివిజన్ పట్టణ ఆరోగ్య కేంద్రం లక్ష్మీపురంలో ఈరోజు టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిశ్చయ్ శిబిరం – ఫేస్ టు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ హాజరై తనతోపాటు డివిజన్‌లోని 56 మందికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ బి. మాణికేశ్వర్ రెడ్డి, సూపర్వైజర్ పారిజాతం, రేడియోగ్రాఫర్ ఆర్. రమేష్, ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం జయ ప్రభావతి, ఆశా కార్యకర్తలు అనంతలక్ష్మి, రజిత, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌లు