చెత్త వేస్తే చలానా ఖాయం.. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో దుకాణాలపై భారీ
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
చెత్త వేస్తే చలానా ఖాయం.. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో దుకాణాలపై భారీ జరిమానాలు ..
రామగుండం: బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేస్తూ నగర పరిశుభ్రతకు భంగం కలిగిస్తున్న దుకాణాలపై రామగుండం నగరపాలక సంస్థ కఠిన చర్యలు చేపట్టింది.
బుధవారం నగర పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి మజీద్ కార్నర్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని దుకాణాల ముందు చెత్త కుప్పలు కనిపించడంతో సంబంధిత నిర్వాహకులపై వెంటనే జరిమానాలు విధించాలని మున్సిపల్ పారిశుధ్య విభాగం అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్, జవాన్ ఎం. తిరుపతి సంబంధిత దుకాణ నిర్వాహకులకు రూ.1000 చొప్పున జరిమానాలు విధించారు..మొత్తం 10 దుకాణాల నుంచి రూ.11,500 జరిమానా వసూలు చేసినట్లు సానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్ తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు నగరంలో చెత్త పారవేసేవారిపై ఇదే తరహా చర్యలు కొనసాగుతాయని, నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
కామెంట్‌లు