ముర్మూర్ గ్రామంలో IKP కొనుగోలు కేంద్రం ప్రారంభం – రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం: మనాలి ఠాకూర్

 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

ముర్మూర్ గ్రామంలో IKP కొనుగోలు కేంద్రం ప్రారంభం – రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం: మనాలి ఠాకూర్

రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, సతీమణి మనాలి ఠాకూర్ అంతర్గాం మండలంలోని ముర్మూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన IKP కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులకు కనీస మద్దతు ధర (MSP) కల్పించడం మరియు మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వానికి వడ్లు విక్రయించే సౌకర్యాన్ని అందించడం ఈ కొనుగోలు కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం పొందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు..అలాగే ఈ కేంద్రం ద్వారా రైతులకు సమయానికి చెల్లింపులు అందడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడడం, ధాన్యం నిల్వ సమస్యలు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. రైతుల ఆదాయం పెరగడం మరియు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రామగుండం అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గడ్డం తిరుపతి , సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కి రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు