కార్పొరేటర్ కందుల సతీష్ స్వరూప ఆధ్వర్యంలో పీటీఎం సమావేశం – పాఠశాల అభివృద్ధికి ప్రణాళికలు

{ఇది మన హక్కు సమాచార పత్రిక : గోదావరిఖని}

కార్పొరేటర్ కందుల సతీష్ స్వరూప ఆధ్వర్యంలో పీటీఎం సమావేశం – పాఠశాల అభివృద్ధికి ప్రణాళికలు..


రామగుండం ; 21వ డివిజన్‌లోని ఎంపీ యుపిఎస్ లక్ష్మీపూర్ పాఠశాలలో అకాడమిక్ ఇయర్ 2025-26 చివరి పని దినం సందర్భంగా ఈరోజు పీటీఎం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కందుల సతీష్ స్వరూప హాజరై విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు అందించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంఖ్య పెంపు, రాబోయే విద్యా సంవత్సరానికి ప్రణాళికలపై చర్చించారు..అదనంగా పాఠశాలలో ప్రారంభం కానున్న డిజిటల్ తరగతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు పెంచేందుకు జూన్ మొదటి వారంలో ‘బడి బాట’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు...ఈ కార్యక్రమంలో లక్ష్మీపూర్ వాసులు పెద్దలు మాధవరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు..

కామెంట్‌లు