రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో కరీంనగర్ జిల్లా జట్టు ఛాంపియన్

 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో కరీంనగర్ జిల్లా జట్టు ఛాంపియన్

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ వేదికగా ఏప్రిల్ 27 నుండి 29 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ బుధవారం ముగిసింది. డీఎఫ్ఏ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో కరీంనగర్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది.
ఫైనల్‌లో కరీంనగర్ జట్టు, రంగారెడ్డి జిల్లా హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ జట్టుతో తలపడి 1-0 గోల్ తేడాతో విజయం సాధించింది. హకీంపేట్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
విజేత జట్టును రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ W. గణపతి, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయుడు, ఉపాధ్యక్షుడు W. వెంకటరావు అభినందించారు.
జట్టును విజయానికి నడిపించిన హెడ్ కోచ్ W. విజయ్, అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ కృషిని కొనియాడారు. క్రీడాకారిణుల క్రమశిక్షణ, కఠిన శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రోత్సాహం కూడా జట్టుకు తోడ్పడిందని పేర్కొన్నారు.

కామెంట్‌లు