రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి – బీజేపీ డిమాండ్
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి – బీజేపీ డిమాండ్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ సేఫ్టీ అథారిటీ మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..ఇటీవల ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఇందిరానగర్, గౌతమి నగర్ ప్రాంతాలను బీజేపీ శ్రేణులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించకుండా, సరైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయకుండా టౌన్ ప్లానింగ్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 ఫీట్ల రహదారిగా ఉన్న గౌతమి నగర్ రోడ్డును బీజేపీ నాయకులు స్వయంగా కొలిచి, అక్కడి నుంచే టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు..అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజీపేట శివాజీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ సెక్రటరీ ఉమామహేశ్వర్ గారికి వినతిపత్రం అందజేశారు.
వారం రోజుల్లో ప్రమాద ప్రాంతాల్లో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు..ఈ కార్యక్రమం లక్ష్మీ నగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో, మాజీ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ నేతృత్వంలో జరిగింది..ఈ కార్యక్రమంలో కాశిపేట శివాజీ, జక్కుల నరహరి, మాతంగి రేణుక, ఐత పవన్, సులువ లక్ష్మీ నరసయ్య, కొండపర్తి సంజీవ్ కుమార్, మాదర బోయిన రాకేష్, జనగామ సాగర్, కంపెల్లి రఘు, రాజేష్ శర్మ, శ్రావణ్ యాదవ్, రాజ్ కుమార్, బంగారి సునీల్, కుమార్, సాయి ప్రదీప్, వేరుకొండ ప్రవీణ్ గౌడ్, కొమ్మల స్వామి, పులిపాక పూర్ణ చందర్, పాశం రాజు, మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు...
కామెంట్‌లు