కొత్త బొగ్గు అమ్మకం విధానంలో ప్రభుత్వ సంస్థలు సత్తా చాటాలి: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని📍
సింగరేణి భవన్, హైదరాబాద్: దేశంలో బొగ్గు రంగాన్ని మరింత పోటీదారులుగా మార్చేందుకు ప్రవేశపెడుతున్న కొత్త అమ్మకపు విధానంలో ప్రభుత్వ సంస్థలు కూడా తమ ప్రతిభను చాటాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సూచించారు..మగళవారం నాడు న్యూఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా బొగ్గు గనుల సంస్థల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తూ, నేషనల్ కోల్ ఎక్స్చేంజ్ ద్వారా బొగ్గు విక్రయాల విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తక్కువ ధరకు బొగ్గు విక్రయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వినియోగదారులు తమకు నచ్చిన గ్రేడ్ బొగ్గును ఎంచుకునే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తుందని పేర్కొన్నారు..ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పనితీరును సమీక్షిస్తూ, ప్రస్తుత పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకు అందించడం కీలకమని సూచించారు. అలాగే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి మార్కెట్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి సంస్థ భవిష్యత్తు ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ఏడాది ఐదు కొత్త ఓపెన్ కాస్ట్ గనుల ప్రారంభానికి అనుమతుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జేకే ఓసీ (ఇల్లందు), మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ, రామగుండం ఓసీ-1 ఫేజ్-3, గోలేటి ఓసీ, ఆర్కే ఓపెన్ కాస్ట్ గనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీటికి అటవీ, పర్యావరణ అనుమతులు అవసరమని పేర్కొన్నారు..వినియోగదారులకు మరింత నాణ్యమైన బొగ్గును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎండాకాలంలో బొగ్గు నిల్వలు లేకుండా రవాణా పెంచుతున్నామని సీఎండీ తెలిపారు. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ భూమి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, కొత్త గనుల ప్రారంభానికి సీపీఎస్యూ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె. వేంకటేశ్వర్లు (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్), తిరుమలరావు (ఈ & ఎం), ఈడీ (కోల్ మూవ్మెంట్) బి. వెంకన్న, జీఎం (మార్కెటింగ్) టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు...
కామెంట్‌లు