కక్షిదారులకు న్యాయం అందించటమే ధ్యేయం: బదిలీ న్యాయమూర్తి కోట్ల లావణ్య బాల్ రెడ్డి
గోదావరిఖని, జూలై 24 (ఇది మన హక్కు): కక్షిదారులకు సత్వర, సమర్థవంతమైన న్యాయం అందించడంలో న్యాయవాదులు, న్యాయస్థానాల పాత్ర అత్యంత కీలకమని వనపర్తి జిల్లాకు బదిలీ అయిన గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి కోట్ల లావణ్య బాల్ రెడ్డి అన్నారు...స్థానిక లేబర్ కోర్టు ఆవరణలో గురువారం రాత్రి గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెకు ఆత్మీయ వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ, కోర్టు విచారణల్లో ఒకరు గెలవడం, మరొకరు ఓడిపోవడం సహజమైన ప్రక్రియేనని పేర్కొన్నారు. అయితే ప్రతి కేసులో న్యాయం, చట్టబద్ధత, నిష్పక్షపాతమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని, బాధితులకు న్యాయం అందించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.తాను గోదావరిఖనిలో విధులు నిర్వహించిన కాలంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి అనుభవాలు తనకు చిరస్మరణీయంగా నిలుస్తాయని పేర్కొన్నారు..అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తి కోట్ల లావణ్య బాల్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేసి అభినందించారు. వనపర్తిలో ఆమె మరింత ఉన్నత స్థాయిలో సేవలందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జీవన్ సూరజ్ సింగ్, మున్సిఫ్ మేజిస్ట్రేట్లు నల్లాల వెంకట సచిన్ రెడ్డి, శ్రీనిజ కోహిర్కర్, స్వారిక, బార్ కౌన్సిల్ సభ్యురాలు చందాల శైలజ, ఏజీపీ ముష్కే రవికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు, ప్రధాన కార్యదర్శి గుజ్జేటి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కుడిది వెంకటేష్, జాయింట్ సెక్రటరీ కుమార్ ముచ్చకుర్తి, నాయకులు అసంపల్లి రవీందర్, గజ్జెల ప్రసన్న, ముక్కెర అంజలి, షానవాజ్ ఖాన్, చిదురాల రమేష్, దాట్ల కిరణ్, మార్కాపురి తిలక్‌తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు నడిపెల్లి కిషన్‌రావు, సంజయ్ కుమార్, కొసన శ్రీనివాసరావు, వివిధ కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు..
ఇది మన హక్కు సమాచార పత్రిక✍️ మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి