మూడు నెలలుగా జీతాలు బకాయి.. ఎంపీడీఓకు ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి
రామగిరి, జూలై 23 (ఇది మన హక్కు):
రామగిరి మండలంలోని VB-RAM G (ఉపాధి హామీ) విభాగంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గురువారం ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు.
మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ, పిల్లల విద్య, ఇంటి అద్దె, రుణాల చెల్లింపులు, నిత్యావసర ఖర్చులు నిర్వహించడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఇకపై ప్రతి నెలా వేతనాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఉపాధి హామీ పథకం అమలులో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నందున వారి సేవలకు తగిన గుర్తింపు కల్పిస్తూ వేతనాలు ఆలస్యం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి