బీసీ, ఎస్సీ గురుకులాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: రాజ్ ఠాగూర్‌కు కవ్వంపల్లి సతీష్ వినతి
గోదావరిఖని, జూలై 21 (ఇది మన హక్కు): రామగుండం ఎమ్మెల్యే, తెలంగాణ బీసీ వెల్ఫేర్ చైర్మన్ రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ను ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కవ్వంపల్లి సతీష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ గురుకుల పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ భవనాలు లేని బీసీ హాస్టళ్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని, హాస్టళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని కోరారు. అలాగే గురుకుల కళాశాలల్లో విద్యార్థుల సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేసి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపై స్పందించిన రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, గురుకులాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి