ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
భీమారం పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ.. రికార్డులు, శాంతిభద్రతలపై సీపీ అంబర్ కిషోర్ ఝా సమీక్ష
మంచిర్యాల, జూలై 21 (ఇది మన హక్కు):
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, నిర్వహణ, విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించి వివిధ రికార్డులను తనిఖీ చేశారు.
ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ సిబ్బందితో మాట్లాడి ఆన్‌లైన్ రికార్డుల నమోదు, కేసుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, శాంతిభద్రతల పరిస్థితి, గ్రామాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
5ఎస్ విధానంలో భాగంగా పోలీస్ స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రోడ్డు ప్రమాదాల బ్లాక్‌స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి