'స్వరాజ్యం నా జన్మహక్కు' నినాదంతో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు బాలగంగాధర్ తిలక్: అడిగొప్పుల రాజు
గోదావరిఖని, జూలై 23 (ఇది మన హక్కు): స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ అని విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి అడిగొప్పుల రాజు అన్నారు..విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరిఖని తిలక్‌నగర్ డౌన్‌లోని బాలగంగాధర్ తిలక్ విగ్రహం వద్ద ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు..అడిగొప్పుల రాజు మాట్లాడుతూ, గణేశ్ ఉత్సవాలను ప్రజా ఉద్యమంగా మార్చి సమాజంలో దేశభక్తిని, ఐక్యతను పెంపొందించిన మహనీయుడు తిలక్ అని కొనియాడారు. హిందూ సమాజ సంఘటనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, నేటి యువత తిలక్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, సామాజిక ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు అడిగొప్పుల రాజు, అరెల్లి జలంధర్, సంపత్ యాదవ్, కొండపర్తి లింగన్న, మ్యాదగొని రవీందర్, దిగంబర్, అరవింద్, కోటగిరి నరేష్, జక్క రాయమల్లు, రాజిరెడ్డి, సాయిలు, మహేష్, పవన్ కుమార్, శంకర్, అజయ్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి