పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.. 25 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అందజేత
పాలకుర్తి, జూలై 23 (ఇది మన హక్కు):
రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాలకుర్తి మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల సర్పంచ్‌లు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి