పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లేజర్ పద్ధతిలో అర్షమొలల శస్త్ర చికిత్సలు.

 ఇది మన హక్కు పెద్దపల్లి టౌన్ రిపోర్టర్✍️

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లేజర్ పద్ధతిలో అర్షమొలల శస్త్ర చికిత్సలు

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లేజర్ పద్ధతి ద్వారా అర్షమొలల ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మన ఆసుపత్రిలో సాధారణంగా పైల్స్ ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, కానీ లేజర్ పద్ధతిలో శస్త్ర చికిత్స చేయడం ఇదే మొదటిసారి. ఈ రకమైన సర్జరీలో కోత,కుట్టు అనేవి ఉండవు. నొప్పి కూడా తక్కువగా ఉంటుంది. రెండు రోజులలో పేషెంట్ తన యొక్క అన్ని పనులు చేసుకోగలడు. ఈ తరహా వైద్యం కార్పొరేట్ వైద్యం కరీంనగర్ లోనే చాలా తక్కువ ఆసుపత్రులలో ఇలాంటి సర్జరీలు నిర్వహిస్తారు.ఈ రకమైన సర్జరీలో ప్రభుత్వ ఆసుపత్రులలో చేయడం చాలా అరుదు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతటి గణనీయమైన అభివృద్ధికి కారణమైన ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు,జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష ఐఏఎస్ కి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా ప్రజలు పెద్దపల్లి జిల్లా ప్రజలు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న అధునాతనమైన సేవలను వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...