22, జూన్ 2026, సోమవారం

మార్కండేయ కాలనీ హనుమాన్ టెంపుల్ లొ వర్షల కోసం ప్రత్యేకంగా కప్పతల్లి పూజ నిర్వహించిన స్థానిక మహిళలు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

 మార్కండేయ కాలనీ హనుమాన్ టెంపుల్ లొ వర్షల కోసం ప్రత్యేకంగా కప్పతల్లి  పూజ నిర్వహించిన స్థానిక మహిళలు

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మార్కండేయ కాలనీకి చెందిన మహిళలు మార్కండేయ కాలనీలోని హనుమాన్ టెంపుల్ లో వరుణ దేవుడు కరుణించాలని ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వర్షాలు కురవాలని హనుమాన్ దేవాలయంలో కప్పతల్లి పూజలు నిర్వహించడం జరిగింది గత కొన్ని రోజులుగా బీభత్సమైన ఎండలతో ఈ ప్రాంత వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతూ అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారని వర్షాలు లేక రైతులు కూడా అలమటిస్తున్నారని ఉద్దేశంతో మహిళలంతా కలసి కప్పలకు పెళ్లి చేసి మార్కండేయ కాలనీ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకొని వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు మార్కండేయ కాలనీ బస్తీ వాసులు పాల్గొని విజయవంతం చేశారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి