అంతర్గాం మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నికైన - లగిశెట్టి రాకేశ్ ఉపాధ్యక్షులుగా యాదండ్ల సుమన్,ఎరోజు సత్యనారాయణ
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
అంతర్గాం మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నికైన - లగిశెట్టి రాకేశ్ ఉపాధ్యక్షులుగా యాదండ్ల సుమన్,ఎరోజు సత్యనారాయణ
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మండల అంతర్గాం మండల ఉప సర్పంచ్ల ఫోరం నూతన ఉప సర్పంచ్ ఫోరంల అధ్యక్షునిగా లగిశెట్టి రాకేష్, కార్యవర్గాన్ని ఏకగ్రీవంగాఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లగిశెట్టి రాకేష్ మాట్లాడుతూ మండలంలోని ఉప సర్పంచ్‌లందరూ కలిసికట్టుగా సమావేశమై ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు
ఈ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు.నూతన కార్యవర్గ వివరాలు:
మండల ఉప సర్పంచ్ల ఫోరం నూతన బాధ్యతలు స్వీకరించినవారి వివరాలు:
అధ్యక్షుడుగా లగిశెట్టి రాకేశ్ (ఎగ్లస్పూర్ గ్రామం)
ఉపాధ్యక్షులుగా యాదండ్ల సుమన్ (ముర్ ముర్ గ్రామం), ఎరోజుసత్యానారయణ(సోమన్ పల్లి గ్రామం),ప్రధాన కార్యదర్శిగా కొండ మహేష్ (అంతర్గాం గ్రామం) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సమిష్టి కృషితో మండలాభివృద్ధే ధ్యేయం ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మండలంలోని ఉప సర్పంచ్‌లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ మండలంలోని గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఉత్సాహంగా పాల్గొన్న ఉప సర్పంచ్‌లు ఈ ఎన్నికల కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల ఉప సర్పంచ్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి మద్దతు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి,కార్యవర్గ సభ్యులకు ఉప సర్పంచులు శాలువలతో సన్మానం చేయడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి కార్యవర్గ సభ్యులకు మండల ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు,ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచులు కరివేద స్రవంతి పెద్దంపేట్, ఊసెట్టి ఉషారాణి టి టి ఎస్ అంతర్జాం, బొడ్డు ఉషారాణి గోలివాడ, గుమ్ముల శ్రీకాంత్ ఎల్లంపల్లి, చిలుక సాగర్ బ్రాహ్మణపల్లి, అయినవేణి అనసూర్య
ఆకెన పల్లి, బోండ్ల సురేష్ పొట్యాల, బియ్యాల శ్రీనివాస్ సీసంపేట, మేకల విద్యా కుందనపల్లి, కోయిలాల పోచమ్మ రాయడండి, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు