గోదావరిఖని మున్సిపల్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఆకస్మిక తనిఖీలు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
గోదావరిఖని మున్సిపల్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఆకస్మిక తనిఖీలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని-1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మున్సిపల్ కార్యాలయం, పార్కింగ్ ప్రాంతంలో గోదావరిఖని-1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి,అఫ్జాలోద్దిన్ ,ఎస్ ఐ మనోహర్ లతో పాటు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతం, సందర్శకుల సామగ్రి మరియు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ మరియు వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు మత్తు పదార్థాలకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు.
కామెంట్‌లు