అంతర్గాంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
అంతర్గాంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 12వ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీట్ల శంకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, డీసీసీ కార్యదర్శి పూదరి సత్తయ్య గౌడ్, మాజీ సర్పంచ్ నూకరాజు, కోధురుపాక పవన్, బాణల బుజ్జిబాబు, బాణల స్వామి, గజ్జెల నాగరాజు, యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నక్క రాజ్‌కుమార్ యాదవ్‌తో పాటు వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు