చికాగో అమరవీరుల స్ఫూర్తి తో- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై పోరాడుదాం తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
చికాగో అమరవీరుల స్ఫూర్తి తో- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై పోరాడుదాం
తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్
:RG2.CHP కార్మికులకు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలపై కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దు దుర్మార్గమైన చర్య
కార్యదర్శి నాగరాజ్ నాయకులు బోయరాజు అధ్యక్షతన జరిగిన 140వ,మేడే కార్యక్రమానికీ TCKS తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ హాజరై మేడే జెండాను ఎగురవేశారు అనంతరం జరిగిన మీటింగునుద్దేశించి మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతు అంతర్జాతీయ కార్మిక, శ్రామికుల హక్కుల దినం కార్మికుల నెత్తుటి రక్తంతో సాధించినటువంటి రోజు మేడే. రోజు 16 గంటలు పనిచేస్తున్నటువంటి నాటి శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి ఎనిమిది గంటల పని కల్పించినటువంటి గొప్ప రోజు మేడే ఈ పవిత్రమైన మేడే సందర్భంగా శ్రామిక కార్మిక కర్శక వర్గాలు మరింతగా ఉమ్మడిగా పోరాడి వారి హక్కులను సాధించాలని లేనియెడల కార్మిక క్షేత్రం ఒక తాటిపైన ఉండి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి పిలుపునిచ్చారు
కామెంట్‌లు