నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఓక్లే పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి – AISF, NSUI

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఓక్లే పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి – AISF, NSUI

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ విద్యా నియమ నిబంధనలు పాటించకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓక్లే పాఠశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని AISF, NSUI విద్యార్థి సంఘాల నాయకులు పెద్దపల్లి జిల్లా విద్యాధికారి జి. శారద గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా AISF పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, NSUI రాష్ట్ర కార్యదర్శి బైరిమల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రామగుండం మండలం గోదావరిఖని జనగామ శివారులో ఉన్న ఓక్లే పాఠశాల రంగురంగుల కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఆర్భాట ప్రచారాలతో ప్రజలను ఆకర్షిస్తూ తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతులు, విద్యా ప్రమాణాల విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
విద్యా వ్యవస్థను కాపాడేందుకు సంబంధిత అధికారాలు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా విద్యాధికారి జి. శారద సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో AISF పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆర్నకొండ సాయి ఆజాద్, రాజు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...