స్వచ్ఛ రామగుండం లక్ష్యానికి మెప్మా ఆర్‌పీలు కీలకం – మేయర్ మహంకాళి స్వామి
ఇది మనహక్కు రామగుండం మండల్ రిపోర్టర్ ✍️
స్వచ్ఛ రామగుండం లక్ష్యానికి మెప్మా ఆర్‌పీలు కీలకం – మేయర్ మహంకాళి స్వామి
స్వచ్ఛ రామగుండంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో మెప్మా ఆర్‌పీలు కీలక పాత్ర పోషించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆర్‌పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్త బయట పడవేసే వారి ఫోటోలు తీసి మున్సిపల్ అధికారులకు పంపించాలని తెలిపారు. పలుమార్లు చెప్పినా వినకుండా చెత్త వేస్తే తప్పనిసరిగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
స్వచ్ఛ రామగుండం లక్ష్య సాధనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, నగర అభివృద్ధికి సంబంధించి సలహాలు, సూచనలు స్వాగతిస్తున్నామని అన్నారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు...
కామెంట్‌లు