గిన్నిస్ రికార్డ్ సాధించిన కరాటే మాస్టర్ పసునూటి చందు

 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

గిన్నిస్ రికార్డ్ సాధించిన కరాటే మాస్టర్ పసునూటి చందు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఫైవ్ ఇంక్లైన్ ప్రాంతానికి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ వ్యవస్థాపకుడు పసునూటి చందు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈనెల 26న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కటా ప్రోగ్రాంలో పాల్గొని 20 నిమిషాల్లో 40 సార్లు కరాటే కటా ప్రదర్శన చేసి అరుదైన ఘనతను అందుకున్నారు.
సుమారు 2000 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో చందు ప్రతిభను చాటుకుని గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. చిన్నప్పటి నుంచి కరాటేపై ఆసక్తితో నిరంతర సాధన, క్రమశిక్షణ, గురువుల మార్గదర్శకతతో ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్కేఐ ఇండియా చీఫ్ రచ్చ శ్రీను బాబు, జిల్లా కరాటే మాస్టర్లు పసునూటి శంకర్, తగరపు శంకర్, కరాటే శ్రీనివాస్, ఒడ్డెపల్లి సురేష్, మంథని నాగరాజు తదితరులు అభినందనలు తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...