న్యాయసేవాధికార సంస్థ, ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం, అవగాహన సదస్సు, ర్యాలీ..

రామగుండం పోలీస్ కమీషనరేట్....


రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా "అరైవ్ -అలైవ్" కార్యక్రమం లో భాగంగా భవిష్యత్తు లో రోడ్డు ప్రమాద రహిత సమాజం, ప్రమాదాలలో మరణాలు నియంత్రణ లక్ష్యంతో మండల న్యాయసేవాధికార సంస్థ, గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, న్యాయ పరమైన అంశాలు, ట్రాఫిక్ నియమాలపై  అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆవరణలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం కి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ టి. శ్రీనివాసరావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ లు ముఖ్య అతిథులు గా హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్జి మాట్లాడుతూ....ట్రాఫిక్ నియమాల పాటించడం వల్ల ప్రమాదాలను ఎలా నివారించవచ్చో, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం ప్రాధాన్యత, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలు, మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. అలాగే రోడ్డు ప్రమాదాల సందర్భంలో చట్టపరమైన హక్కులు, బాధ్యతలపై న్యాయసేవాధికారులు అవగాహన కల్పించారు. జడ్జి, పోలీస్ అధికారులతో కలిసి జెండా ఊపి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో కలిసి రహదారి భద్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుంది తెలిపారు.ఏసీపీ మాట్లాడుతూ..... ఎక్కువ మంది యువకులు యుద్దాల సమయంలో కన్నా నిత్యం మైనర్, ర్యాష్, త్రిబుల్ రైడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ఎక్కువ మంది మరణించడం జరుగుతుంది అన్నారు. విద్యార్ధి దశ నుండి రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, మీమీ కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు అందరూ పాటించేలా వారికీ అవగాహన కలిపిస్తూ, చైతన్య పరుస్తూ విద్యార్థులు రోడ్డు భద్రతకు రాయబారులుగా మారి సమాజంలో మార్పుకు దోహదపడాలని  ఏసీపీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో డా. టి. శ్రీనివాస్ రావుఅదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి, గోదావరిఖని, ఐ.సురత్ రాజ్ సింగ్,సెషన్స్ న్యాయమూర్తి, ఎన్. వెంకట సచిన్ రెడ్డి, ప్రధాన న్యాయమూర్తి (ప్రిన్సిపల్ జడ్జి), ధ్రువ వెంకటేష్ద్వితీయ అదనపు న్యాయమూర్తి (II అదనపు జడ్జి), ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ట్రాఫిక్ ఎస్ ఐ హరిశేఖర్, రామరాజు, లాయర్లు, కోర్ట్ సిబ్బంది, ప్రభుత్వ, శ్రీ చైతన్య మహర్షి డిగ్రీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...