ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు షూ పంపిణీ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు బాసటగా వి.ఎస్.ఎస్.ఎస్...వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం...
శనివారం:- వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ & చైర్మన్. లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ చేస్తున్న సేవలు అభినందనీయమని. పలువురు పేర్కొన్నారు .గణతంత్ర దినోత్సవం సందర్భముగా, శుక్రవారం గోదావరిఖని 5 ఇంక్లైన్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ (వి.ఎస్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో, గోదావరిఖని కళ్యాణ్ నగర్ లోని. హాలీవుడ్ షూస్ నిర్వాహకులు షేక్ జాన్ మహమ్మద్, తాజ్ సహకారంతో . విద్యార్థులకు షూ అండ్ సాక్సులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ గౌరవ అధ్యక్షులు పెద్దంపేట్ శంకర్ గౌడ్ ,ప్రధాన కార్యదర్శి. లయన్ డా, సిహెచ్ కిషన్ రావు , ఎంఈ ఓ మల్లేశం , సంస్థ సలహాదారులు లయన్ డా,కే. రాజేందర్ , జి ఎం టి లయన్ బంక రామస్వామి, గోదావరిఖని ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు పూదరి కుమార్, సంస్థ ఫౌండర్ & చైర్మన్ లయన్ డా, సురభి శ్రీధర్ హాజరై షూ అండ్ సాక్స్ లు పంపించేశారు. అనంతరం వారు మాట్లాడారు. హాలీవుడ్ షూ యాజమాన్యం సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షూలు అండ్ సాక్స్ లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తమ పిల్లల్ని స్కూలుకు పంపించాలని అన్నారు . ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తమ వంతు సహాయంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం హాలీవుడ్ నిర్వాహకులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వాకులు, తుము నరసయ్య, గడవేన సదానందం, భూపెల్లి జ్యోతి, దామోదర్ శర్మ, ముల్కల ప్రసాద్,భవాని దీక్ష యజ్ఞ సేవాసమితి అధ్యక్షుడు కట్ల సురేష్ భవాని, పాఠశాల హెచ్ఎం మల్లారెడ్డి, తో పాటు అధ్యాపకులు సమ్మయ్య, శ్రీనివాస్, రాజేశ్వరి, ప్రేమ్ కుమార్, సరళ కుమారి, విద్యాసాగర్, రాజేశ్వరి, సరిత, జోష్ణ, తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు...
కామెంట్‌లు