,🖇️🖇️✍️బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పొన్నం అశోక్ గౌడ్ విజయం ఖాయం-.✍️✍️...
@బార్ అసోసియేషన్ గోదావరిఖని//..
పొన్నం అశోక్ గౌడ్ కు ఘన స్వాగతం పలికిన న్యాయవాదులు ...
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచన మేరకు, రామగుండం కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్‌గా పోటీ చేస్తున్న టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్‌కు ఘన స్వాగతం పలికారు.స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో దాదాపు 200 మంది న్యాయవాదులతో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని న్యాయవాదులను కోరారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి రాష్ట్ర నాయకులు మాదాసు శ్రీనివాస్, ముస్కె రవికుమార్, ప్రభుత్వ న్యాయవాదులు శంతన్ కుమార్, సౌజన్య, సీనియర్ న్యాయవాదులు మేడ చక్రపాణి, పాత అశోక్, దేశెట్టి అంజయ్య, జవ్వాజి శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.
కామెంట్‌లు