మత, కుల విభేదాలు రెచ్చగొట్టే పాఠ్యాంశాలను తొలగించాలి – యూఎస్‌ఎఫ్‌ఐ
విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం, రాజ్యాంగ విలువలు బోధించాలి: మాడిశెట్టి అరుణ్ కుమార్
నంద్యాల, జూలై 20 (ఇది మన హక్కు):
పాఠ్యపుస్తకాలలో మత, కుల విభేదాలను ప్రోత్సహించే అంశాలను తొలగించి, శాస్త్రీయ దృక్పథం, రాజ్యాంగ విలువలను పెంపొందించే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్‌ఎఫ్‌ఐ) జాతీయ సలహాదారు మాడిశెట్టి అరుణ్ కుమార్ అన్నారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నంద్యాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక శిక్షణా తరగతులను ప్రారంభించారు. కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఏఐకేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మార్రెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించగా, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం భగత్‌సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 46 మంది విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు..'వైజ్ఞానిక ఆలోచన' అంశంపై మాట్లాడిన మాడిశెట్టి అరుణ్ కుమార్, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన సమయంలో మత, కుల విభేదాలకు అవకాశం కల్పించే బోధన సమాజానికి హానికరమని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, శాస్త్రీయ ఆలోచన, చరిత్ర, ప్రజాస్వామ్య విలువలు విద్యార్థి దశ నుంచే బోధించాలని కోరారు..ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి మాదం తిరుపతి, జాతీయ ఉపాధ్యక్షుడు తాటికొండ రవి, రాష్ట్ర కార్యదర్శి సందెపోగు ఉదయ్ కుమార్, రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి, ఓబుల్ రెడ్డి, సందీప్, అభి, మధు, విష్ణు తదితరులు పాల్గొన్నారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి