మార్కండేయ కాలనీలో డ్రైనేజీ పనులను పరిశీలించిన మేయర్ మహంకాళి స్వామి
గోదావరిఖని, జూలై 25 (ఇది మన హక్కు): రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక 49వ డివిజన్‌లో కార్పొరేటర్ సాగి సంతోష్ రావు ఆధ్వర్యంలో మార్కండేయ కాలనీలో రాజేష్ థియేటర్ సమీపంలోని ఫ్రీ లెఫ్ట్ జంక్షన్ వద్ద కొనసాగుతున్న డ్రైనేజీ పనులను రామగుండం మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని సంబంధిత మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్న మేయర్, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి