ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రామగుండం, జూలై 24 (ఇది మన హక్కు): గోదావరిఖని (రామగుండం) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో అత్యాధునిక వైద్య సేవలు, నిపుణులైన వైద్యులు, ఆధునిక పరికరాలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఖర్చులు చేయకుండా ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు..ఆసుపత్రిలో ఆధునిక కంప్యూటరైజ్డ్ ల్యాబ్ ద్వారా రక్తం తదితర పరీక్షల ఫలితాలను రెండు గంటల్లోనే రోగుల మొబైల్‌కు పంపుతున్నట్లు తెలిపారు. గుండె వ్యాధుల నిర్ధారణకు రెండు 2డీ ఈకో యంత్రాలు, ఫిజియోథెరపీ విభాగంలో ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు..అలాగే పాత భవనంలోని ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, SNCU, ANC, PNC, PICU వార్డుల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సీసీ రోడ్లు, కాంపౌండ్ గోడ ఎత్తు పెంపు, కంటి ఆపరేషన్ థియేటర్, మార్చురీ పునరుద్ధరణ వంటి అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు..నాణ్యమైన వైద్య సేవలు, ఆధునిక పరీక్షలు, ప్రత్యేక చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులో ఉన్నందున ప్రజలు వాటిని వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి