13, జనవరి 2026, మంగళవారం

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తుది ఓటరు జాబితా విడుదల..

         ((రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ :))::

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తుది ఓటరు జాబితా విడుదల..

తెలంగాణ  రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారo రామగుండం నగర పాలక సంస్థ తుది ఓటరు జాబితా సోమవారం ప్రచురించారు. అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ  ఆదేశాల మేరకు  రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహిoచిన  కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ , డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు , ఎ సి పి శ్రీహరి , టి పి ఎస్ నవీన్ , ఆర్ ఓ ఆంజనేయులు , ఆర్ ఐ లు శంకర్ రావు , ఖాజా ,  టి పి బి ఓ లు హిమజ , సిందూజ  పాల్గొని జాబితా ప్రదర్శించారు. మొత్తం అరవై డివిజన్లలో 1, 83, 049 ఓటర్లు ఉండగా ఇందులో  పురుషులు 91, 441 ,  మహిళలు 91, 578 , ఇతరులు 30 ఉన్నారు...
                 
                                           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి