*..సంక్రాతి పండుగకి ఉరికెళ్తున్నారా... జాగ్రత్త.. పోలీస్ వారి సూచనలు పాటించండి.* *"అప్రమత్తంగా ఉండండి..."మీ జాగ్రత్తే... మీ ఇంటికి ఉత్తమ రక్షణ."*  ..

 రామగుండం పోలీస్ కమిషనరేట్..
 తేదీ:-12-01-2026

.సంక్రాతి పండుగకి ఉరికెళ్తున్నారా... జాగ్రత్త.. పోలీస్ వారి సూచనలు పాటించండి.* *"అప్రమత్తంగా ఉండండి..."మీ జాగ్రత్తే... మీ ఇంటికి ఉత్తమ రక్షణ."*  ..

ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులకి, డయాల్ 100 కి సమాచారం అందించాలి : గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి*సంక్రాతి పండుగ సందర్భంగా సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు, బంధువుల ఇండ్లకి, విహార యాత్రలకు వెళ్లే ప్రజలు, ఆపార్టుమెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ సమయం లో గోదావరిఖని వన్ టౌన్ పరిధి ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరించగలరు అని తెలిపారు.*ప్రజలకు గోదావరిఖని వన్ టౌన్ పోలీసుల సూచనలు:*  మీ విలువైన వస్తువులను భద్రపరచండి, పండుగలను సురక్షితంగా జరుపుకోండి. మీ ఇళ్లు సురక్షితంగా ఉన్నప్పుడే పండుగ ప్రయాణాలు సురక్షితం. ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. బీరువా తాళాలను ఇంట్లో ఇతరులకు అందుబాటులో ఉంచరాదు తమతో పాటే తీసుకెళ్లాలి. సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోండం మంచిది. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి పోలీస్టేషన్ లో సమాచారం ఇవ్వండి. వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తాం. మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా వీల్స్ లాక్ తో, చైన్స్ తో  పోల్స్, చెట్లకు లాక్ వెయ్యడం మంచిది. నమ్మకమైన వ్యక్తులను, వారి మొబైల్ నంబర్స్, ఆధార్ కార్డు డీటెయిల్స్ వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని  మాత్రమే వాచ్ మెన్/ సెక్యూరిటీ గార్డ్/ సర్వెంట్ గా పనిలో నియమించుకోవాలి.   మీ ఇంట్లో స్వీయ రక్షణ సీసీ కెమెరాలను అమర్చుకోవాలి. 1000 రూపాయలకు ఆన్లైన్లో సీసీ కెమెరాలు  లభిస్తున్నాయి అవి ఏర్పాటు చేసుకోవడం వలన లక్షల రూపాయల విలువైన ఆస్తులకు రక్షణ ఉంటుంది. ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటిని, పరిసరాలను లైవ్/ ప్రత్యేక్షంగా చూసుకొవచ్చు. సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి.   ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కట్టిన వేయాలి. ఇంటిముందు, ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి. ఇంట్లో లేనప్పుడు పని మనుషులు ఉంటే రోజు వాకిలి ఊడ్చమని చెప్పాలి.  ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్స్, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడండి. వాటిని కూడా గమనించి నేరస్థులు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నది. మీమీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. డయల్ 100కు కాల్ చేయండి. ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రించడం సులభం అవుతుంది సీఐ  తెలిపారు...


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...